అల్ట్రాసౌండ్ సేవలు లేవు
మహేశ్వరం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 16 మంది వైద్యులకు గాను ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, ఆప్తమాలజీ, పైతాలజీతో పాటు పలు నిపుణులు లేరు. 52 రకాల రక్త, ఇతర పరీక్షలు నిర్వహించి మూడు రోజుల్లో పరీక్షల ఫలితాలు ఇస్తున్నారు. అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయడం లేదు. నిత్యం సుమారు 250 నుంచి 350 వరకు రోగులు వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. డయాలసిస్ సేవలు పెంచాలని స్థానికంగా కోరుతున్నారు. మండల పరిధిలోని దుబ్బచర్ల పీహెచ్‌సీలో తలుపులు, కిటికీలు, ఇతర వైద్య పరికరాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. ప్రసుత్తం మరమ్మతులు చేసి వైద్యం అందిస్తున్నారు.


