పరికరాలు, పరీక్షలు లేవు
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులందరూ డిప్యూటేషన్‌పై వచ్చిన వాళ్లే ఉన్నారు. ఇటీవల పాత ఆస్పత్రి స్థానంలో నూతనంగా నిర్మిస్తున్నారు. అవుట్ పేషెంట్లకు చికిత్స తప్పా అడ్మిట్ చేసుకొని వైద్యం అందించే సదుపాయాలు లేవు. డీపీహెచ్ కింద ఇద్దరు, టీవీవీపీ కింద నలుగురు వైద్యులు సేవలందిస్తున్నారు. నిత్యం 10 నుంచి 15 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ కేంద్రానికి నీటి కొరత ఉంది. రోజూ 250 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తారు. ఆస్పత్రిలో ఎలాంటి శస్త్ర చికిత్సలు జరగడం లేదు. అందుకు అవసరమైన పరికరాలు, పరీక్షలు అందుబాటులో లేవు. 100 పడకల ఆస్పత్రిగా మారితేనే మెరుగైన సేవలు అందుతాయి.


