రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
కందుకూరు: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, స్థానిక పీఎస్ సీఐ సీతారామ్ అన్నారు. అరైవ్, అలైవ్ క్యాంపెయిన్–2026లో భాగంగా శనివారం మండల పరిధిలోని కొత్తగూడ చౌరస్తాలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం, అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు ఎంతో ప్రమాదకరమైనవన్నారు. అలాంటి తప్పిదాలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. అనంతరం సురక్షితంగా రోడ్డు దాటడం, లేన్ క్రమశిక్షణ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ పాండు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమాలపై
అవగాహన
షాద్‌నగర్‌రూరల్: ప్రజల భద్రతే ముఖ్యమని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో శనివారం పట్టణ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో అలైవ్ –అరైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమా దాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. ఎంవీఐ వాసు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించవ చ్చని అన్నారు. రెప్పపాటులో జరిగే చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని అన్నారు. ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నడపడంతో ఎంతో మంది ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నవకిరణినర్సింహ్మ, ఎస్‌ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన
లగచర్ల భూ నిర్వాసితులు
దుద్యాల్: మండలంలోని పారిశ్రామిక వాడ భూ నిర్వాసితులు శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నగరంలోని తెలంగాణ భవన్‌లో కలిశారు. ఇక్కడి పరిస్థితులను ఆయనకు వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించనట్లు వారు తెలిపారు. కార్యక్ర మంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల సురేశ్, పులిచర్లకుంట తండా గోపాల్ నాయక్, రోటిబండ తండా రాములు నాయక్, పోలేపల్లి విశాల్, మడిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత


