ఎయిర్ ఇండియా పైలెట్‌గా మరియాపురం వాసి
షాబాద్: మండలంలోని మరియాపురంవాసి ఎయిర్ ఇండియా పైలెట్‌గా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి బాలశౌరిరెడ్డి ఆరోగ్య మేరీ దంపతుల కుమారుడు సిరిల్‌రెడ్డి ఈనెల 16న బెంగళూరులో జరిగిన ఇంటర్వ్యూలో పైలెట్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందన్నారు. జిల్లా నుంచి మొదటి పైలెట్ కావడం గర్వంగా ఉందన్నారు. చాలా సంతోషంగా ఉందని, అంకిత భావంతో పనిచేస్తానన్నారు. కాగా సిరిల్‌రెడ్డి ఎంపికపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


