ధర్మరక్షణ అందరి బాధ్యత
మొయినాబాద్‌రూరల్: దేవాలయాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, సనాతన ధర్మ పరిరక్షణ అత్యంత అవసరమని ఆలయ అర్చకుల సంఘం రాష్ట్ర చైర్మన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో చెన్నకేశవ ఉత్సవాల్లో ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. ఆలయాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ధర్మ రక్షణలో పాల్గొన్నట్లు అవుతుందని చెప్పారు. చివరి రోజు కావడంతో స్వామివారిని రథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో టపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు పవన్‌కుమార్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


