ఉపాధి చట్టం నిర్వీర్యానికి కుట్ర
● కేంద్ర ప్రభుత్వ విధానాలకు
వ్యతిరేకంగా పోరాటం
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ
అనంతగిరి: ఉపాధిహామీ చట్టం నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ ఆరోపించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 19న వికారాబాద్‌లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లేబర్‌కోడ్స్, వీబీ జీ రామ్‌జీ, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికవర్గాలను అణగదొక్కేలా చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ విషయాల్లో ప్రజలు జాగురతా కావాలని, కేంద్రం విధానాలను ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి బుస్స చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


