సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డిని శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన దివంగత కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా స్ఫూర్తిస్థల్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎంను కలిసి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఆమనగల్లులో అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
భద్రతకు భరోసా ఆర్టీసీ
హయత్‌నగర్: నిష్ణాతులైన డ్రైవర్‌లు ఉండడంతో సురక్షితమైన, భద్రమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సు ప్రతీకగా నిలుస్తుందని ఎల్‌బీనగర్ డీసీపీ అనూరాధ అన్నారు. రోడ్డు భద్ర తా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం హయత్‌నగర్ డిపోలో నిర్వహించిన అలీవ్ అండ్ అరైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్సును నడిపే సమయంలో డ్రైవర్లు ఎంతో క్రమ శిక్షణతో పనిచేయాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్‌లను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కాశిరెడ్డి, సీఐలు నాగరాజుగౌడ్, సంతోష్‌కుమార్, డీఎంలు విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ టికెట్లకు
దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబర్చే పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. దరఖాస్తు ఫారాన్ని పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని.. వివరాలు పూర్తి చేసిన తర్వాత ఏఐఎంఐఎం పేరిట తీసిన రూ.3,000 డిమాండ్ డ్రాఫ్ట్‌తో ఈ నెల 20లోగా సంబంధిత జిల్లా టౌన్, మజ్లిస్ అధ్యక్షుడికి సమర్పించాలని సూచించాయి. అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తిర స్కరిస్తామని, అభ్యర్థుల తుది జాబితాను పార్టీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటిస్తారని మజ్లిస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పతంగ్‌లతో
309 ఫీడర్లు ట్రిప్
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా సరదాగా ఎగరేసిన పతంగ్‌లు విద్యుత్ తీగలకు షాక్ కొట్టాయి. విద్యుత్ తీగలకు పతంగ్‌లు తగిలి మెట్రోజోన్, రంగారెడ్డిజోన్, మేడ్చల్ జోన్ల పరిధిలో బుధవారం 309 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. గురువారం కూడా అదే స్థాయిలో లైన్లు ట్రిప్పయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. మరికొన్ని ప్రాంతాల్లో అర గంటకు పైగా నిలిచిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై.. వైర్ల మధ్య వేలాడుతున్న పతంగ్‌లను తొలగించారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో ఏకంగా 107 ఫీడర్ల ట్రిప్పవడం గమనార్హం.
మున్సిపల్ బరిలో ఉంటాం
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్
చంద్రశేఖర్ ముదిరాజ్
తాండూరు టౌన్: రానున్న మున్సిపల్ ఎన్ని కల్లో తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జ్ అమ్జద్ అలీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ముఖ్య ఉద్దేశంతో బీఎస్పీ కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రజలు తమ అభ్యర్థులను ఆదరిస్తారని, ఎన్నికల్లో తప్పకుండా అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, మంచాల శ్రీకాంత్, అసెంబ్లీ ఇంచార్జి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణయ్యగౌడ్, పట్టణ ఇన్‌చార్జ్ అమ్జద్ అలీ, ఆమీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి


