మన సంస్కృతిని కాపాడుకుందాం
కొడంగల్ రూరల్: భిన్నత్వంలో ఏకత్వంలా ఉండే మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంపర్గ్ ప్రముఖ్ గాజుల సిద్దిరామేశ్వర్ అన్నిరు. గురువారం పట్టణంలోని శ్రీ మహాదేవుని ఆలయ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. పూర్వీకులు ప్రతి పండుగకూ విశేషాలను తెలియజేశారని, కాలనుగుణంగా పండుగల ప్రత్యేక ఉంటుందని, మనమంతా పాటి స్తూ ముందుతరాలకు అందించాల్సి బాధ్యత మన పై ఉంటుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నా యని తెలిపారు. దేశ ఔన్యత్యాన్ని నిలిపేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశంపై ప్రేమ, గౌ రవం, అభిమానం ఉండాలన్నారు. విభిన్న మతా లు, కులాలు, భాషలున్నా, భారతీయ సనాతన ధర్మానికి అనుగుణంగా సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హిందూవాహిని, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


