చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నందిగామ: యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లిలో నిర్వహించిన ఎంపీఎల్ లీగ్ సీజన్–10 క్రికెట్ పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రదానోత్సవం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలను ఆసక్తి ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు.కార్యక్రమంలో సర్పంచ్‌లు హనుమంత్ రెడ్డి, చిందం పాండు, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్‌లు కవిత, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.


