దారుణాలు | - | Sakshi
Sakshi News home page

దారుణాలు

Jan 17 2026 11:41 AM | Updated on Jan 17 2026 11:41 AM

దారుణాలు

దారుణాలు

ఏళ్లు గడిచినా పూర్తికాని వైనం 2020 – 21లో జిల్లాకు 13 రోడ్లు మంజూరు అంచనా వ్యయం రూ. 56.85 కోట్లు నిర్మించాల్సినదూరం 93.9 కిలోమీటర్లు నేటికీ పూర్తి కానివి ఐదు ఇబ్బందుల్లో ప్రయాణికులు

పై ఫొటోలో కనిపిస్తున్నది నవాబుపేటమండలం చించల్‌పేట్‌, అత్తాపూర్‌, అక్నాపూర్‌ గ్రామాల మీదుగా నారేగూడకు వెళ్లే రోడ్డు.. రెండు దశాబ్దాల క్రితం పీఎంజీఎస్‌వై పథకం కింద చించల్‌పేట్‌ గేట్‌ నుంచి అక్నాపూర్‌ వరకు 8 కిలో మీటర్ల రహదారి వేశారు. కాలక్రమేణ గుంతల మయంగా మారింది. నాలుగేళ్ల క్రితం రూ.12 కోట్లతో రీబీటీ తోపాటు, అక్నాపూర్‌ నుంచి నారేగూడ వరకు నాలుగు కిలోమీటర్లు కొత్త రోడ్డుమంజూరైంది. అప్పట్లో పనులు ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. 12 కిలో మీటర్లకు గాను మూడు కిలో మీటర్ల మేర రోడ్డు వేసి చేతులు దులుపుకొన్నారు. ఈ రహదారి ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామానికి వెళ్లేది కావడం గమనార్హం.

వికారాబాద్‌: ప్రాంతాల కనెక్టివిటీకి రోడ్లు ఎంతో కీలకం. మెరుగైన రహదారి వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయి. కానీ ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూ పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ నిధు లు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప నులు పూర్తికావడం లేదు. ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతుండటంతో అంచనా వ్యయం భారీగా పెరు గుతోంది.దెబ్బతిన్న రోడ్ల కారణంగా తరచూ ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. జిల్లాలోని పలు గ్రామీణ రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంట ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతోంది. వంతెనలు, బ్రిడ్జిల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఏటా కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. వాటి పూర్తిపై దృష్టి సారించడం లేదు. కొన్ని రోడ్లు శిలాఫలకాలతో, మరికొన్ని శంకుస్థాపనలతో ఆగిపోత్నుఆయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించాక నిధులు విడుదల కావడం లేదు. దీంతో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.నిర్మాణ వ్యయం పెరిగి కాంట్రాక్టర్లు పనులను మధ్యలో వదిలేసి వెళ్లిపోతున్నా రు. కొన్ని చోట్ల పనులు చేపట్టేందుకు ముందు కు రావడంలేదు. దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. దూరమై న వేరే మార్గాల్లో సొంత గ్రామాలకు వెళ్తున్నారు.

నాలుగేళ్లు కావస్తున్నా..

జిల్లాకు 2020 – 21 సంవత్సరంలో పీఎంజీఎస్‌వై కింద 13 రోడ్లు మంజూరయ్యాయి. 93.9 కిలో మీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.56.85 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో కొన్నింటిని నాలుగేళ్ల క్రితం, మరికొన్నింటిని మూడేళ్లు క్రితం ప్రారంభించారు. 13కు గాను 8 రోడ్లును ఇటీవల పూర్తి చేశారు. ఐదు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని ప్రారంభించి మధ్యలో ఆపేశారు. రోజురోజుకూ నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. నిధుల కొరత కారణంగా రోడ్డు పనులు అక్కడక్కడ నిలిచిపోయిన మాట వాస్తవమేనని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌ ఈఈ ఉమేశ్‌ తెలిపారు.

గ్రామీణ రోడ్లకు గ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement