ఇద్దరు డ్రగ్స్‌విక్రేతల అరెస్ట్
అత్తాపూర్: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తుల వద్ద నిషేధిత మాదక ద్రవ్యం ఎండిఎంంఏ ఉందనే సమాచారం పోలీసులకు అందింది. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 242 వద్ద వాహనాలను నిలిపి వాహనాల తనిఖీ చేపట్టగా ఓ కారులో డ్రగ్ లభ్యమైంంది. బెంగళూర్‌కు చెందిన చరణ్ వద్ద నుంచి అన్వర్‌హుస్సేన్, బుర్రా సంపత్‌లు రూ.25 వేలకు ఎనిమిది గ్రాముల డ్రగ్‌ను కోనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. డ్రగ్‌తో పాటు కారు, ఒక ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు.
పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ విక్రేతలు
ఇద్దరు డ్రగ్స్‌విక్రేతల అరెస్ట్
ఇద్దరు డ్రగ్స్‌విక్రేతల అరెస్ట్


