వ్యక్తి అదృశ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన నాదర్‌గుల్‌లో చోటుచేసుకుంది. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. చింతల ప్రవీణ్‌కుమార్ (30 ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగిస్తాడు. ఈనెల 8న ఉదయం ఇంటి అద్దె చెల్లించాలని యజమాని అడగడంతో, బయటకు వెళ్లి తెస్తానని బయలుదేరాడు. మూడు రోజులు గడిచినా రాకపోవడంతో బంధువులు, తెలిసినవారిని ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాం కాలనీకి చెందిన దాడి అరుణ్‌రెడ్డి(29) శుక్రవారం ఉదయం 9.30 గంటలకు షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అతని భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పీఎస్‌లో లేదా 87126 62367 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
యాచారం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన కె.నర్సింహ(40)కు అతని కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పాడ్డాయి. తీవ్ర మనస్తాపంతో శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య భారతమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీ తెలిపారు.
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
కుత్బుల్లాపూర్: ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి పడి మృతి చెందింది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. హర్యానా రాష్ట్రం ముంగేలి మండలం, బోధిపుర గ్రామానికి చెందిన దోమన్ బంజారా, ఆశ బాయి దంపతులు దండమూడి ఎన్‌క్లేవ్ ఫేజ్–2లోని వారాహి కన్‌స్ట్రక్షన్స్‌లో కూలి పనులు చేస్తున్నారు. ఈ నెల 12న భార్యాభర్తలిద్దరూ భవనం 5వ అంతస్తులో పనిచేస్తుండగా రెండవ కుమార్తె అన్షిక (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 15వ తేది రాత్రి 9 గంటలకు మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్తాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో కారుతో బీభత్సం
● ఇద్దరికి గాయాలు
మియాపూర్: మద్యంతాగి ఓ వ్యక్తి కారు నడుపుతూ భీభత్సం సృషించాడు. మియాపూర్ ఎస్‌ఐ వేంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. బోడ వెంకన్న (52) అనే వ్యక్తి మద్యం తాగి కేపీహెచ్‌బీ నెక్సెస్ మాల్ నుండి మియాపూర్ వైపు శుక్రవారం ఉదయం కారు వేగంగా నడుపుతూ వస్తున్నాడు. గోకుల్‌ప్లాట్స్ ప్రధాన రహదారి పై వేర్వేరు చోట్ల ఇద్దరిని ఢీకొనడంతో గాయపడ్డారు. కిరాణం దుకాణం నడుపుతున్న మాధవరావు(53)తోపాటు మరో వ్యక్తిని ఢీకొట్టాడు. కారు కొంతదూరం వెళ్లాక టైర్ బ్లాస్ట్ కావడంతో అక్కడే అగిపోయింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వ్యక్తి అదృశ్యం
వ్యక్తి అదృశ్యం


