ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య
కొందుర్గు: ఆర్థిక సమస్యలతో వ్యవసాయ కూలీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని విశ్వనాథ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి చంద్రయ్య (48), పద్మమ్మ దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు. చంద్రయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు శ్రీదేవికి ఇటీవలే పెళ్లిచేశారు. పెళ్లి సమయంలో ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేశారు. చేసిన అప్పు ఎలా తీర్చాలా అని తరచూ బాధపడేవారు. ఈ క్రమంలో చంద్రయ్య శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు. పరిసర పొలాల వారు చంద్రయ్య పొలంలో పడి ఉండడం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి కనిపించాడు. దీంతో వెంటనే 108 అంబులెన్స్‌లో షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రవీందర్ నాయక్ తెలిపారు.
బావ చేతిలో మరదలి హత్య
జగద్గిరిగుట్ట: బావ చేతిలో మరదలు హత్యకు గురైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతరానికి చెందిన పవన్ కుమార్ గాజులరామారం చంద్రగిరి నగర్‌లో తన కుటుంబంతో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. పవన్ కుమార్ భార్య సంక్రాంతి పండుగకు బుధవారం ఊరికి వెళ్లగా మహదేవ్‌పురంలో ఉండే తన మరదలు ఎర్ర శైలజ (17) అదే రోజు ఇంటికి వచ్చింది. వీరి మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్విదాదం జరగగా పక్కనే ఉన్న రాడ్డుతో ఆమైపె దాడి చేసి అక్కడినుండి వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ గురువారం వచ్చి చూడగా శైలజ మృతిచెందినట్లు గమనించి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య


