రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద మంజూరు చేసిన యంత్ర పరికరాలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో రైతులను అన్ని రకాలా మోసం చేసిందని విమర్శించారు. సబ్సిడీలకు మంగళం పాడి నట్టేట ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు గురునాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, పద్మజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు కరుణాకర్, భాస్కర్‌చారి, పార్టీ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


