లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jan 14 2026 11:23 AM | Updated on Jan 14 2026 11:23 AM

లారీ

లారీ ఢీకొని వ్యక్తి మృతి

కేశంపేట: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ ఇసాక్‌ (51) గ్రామంలో కుటుంబంతో కలిసి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం పని నిమిత్తం బైక్‌పై కేశంపేటకు వచ్చి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాడు. మండల పరిధిలోని లేమామిడి శివారులో ముందు నుంచి వస్తున్న లారీని డ్రైవర్‌ అజాగ్రత్తగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇసాక్‌ను గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు.

మతి స్థిమితం లేని

వ్యక్తి అదృశ్యం

పహాడీషరీఫ్‌: మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ షాకీర్‌(30)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలో గతేడాది జూలై 22న ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండాపోయింది. అతని సోదరుడు నజీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లేదా 87126 62366 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

అపరిచిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్‌ చేయండి

కరన్‌కోట్‌ పీఏస్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌

తాండూరు రూరల్‌: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంకాంత్రి పండుగకు సొంతూరికి వెళ్లే వారు బంగారంనగదు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి 1
1/1

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement