సమ్‌థింగ్ స్పెషల్
సాగులో..
ఉన్నత చదువులు చదివిన వారు కొందరు.. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి వచ్చిన వారు మరికొందరు.. వ్యవసాయాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్న వాళ్లు ఇంకొందరు.. వినూత్న పంటలతో ముందుకు ‘సాగు’తున్నారు. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఆదర్శంగా నిలుస్తున్నారు.
●అరుదైన పంటల సాగు ●ఆదర్శంగా నిలుస్తున్న జిల్లావాసులు
పరిగి: మండల పరిధిలోని భర్కత్‌పల్లికి చెందిన అవుసుల అనంతయ్య, దోమ మండలం మోత్కూర్‌కు చెందిన శ్రీకాంత్‌రావు డ్రాగన్ ఫ్రూట్‌తో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరా తోటలో ఏటా రూ.2 లక్షల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని శివారెడ్డిపల్లి, సోమన్‌గుర్తి గ్రామాలకు చెందిన పలువురు రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు.
షాబాద్: కుర్వగూడ గ్రామానికి చెందిన దాదె అమృత్‌రాజ్, స్వప్న దంపతులు షాద్‌నగర్‌లో చదువుకున్నారు. అమృత్‌రాజ్ బీఏ బీఈడీ పూర్తి చేయగా, స్వప్న ఎంఏ పీజీ చదువుతోంది. ఉన్నత చదువులు చదివినా స్వయం ఉపాధితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న వీరు పదేళ్ల క్రితం గ్రామంలోని సొంత పొలం రెండు ఎకరాల్లో రూ.15 లక్షలతో పూలమొక్కల నర్సరీ ఏర్పాటు చేశారు. మరో 10 ఎకరాల వరకు పొలాన్ని కౌలుకు తీసుకుని ఆధునిక పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల్లో క్యాప్సికమ్ సాగు చేశారు. కోత ప్రారంభం కావడంతో మార్కెట్‌లో కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతోంది. మొత్తం రూ.4లక్షల వరకు ఖర్చు చేశారు. 8 నెలల వరకు పంట దిగుబడి రానుందని రైతు చెబుతున్నాడు. రోజుకు 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పంటకు మందులు వేయడం, కలుపు తీయడం, కోయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం తదితర పనులు చేస్తుంటారు. భార్యభర్తలు పొలంలోనే పనులు చేస్తూ అక్కడే ఉంటున్నారు.
‘డ్రాగన్’.. వెల్‌డన్
సమ్‌థింగ్ స్పెషల్
సమ్‌థింగ్ స్పెషల్
సమ్‌థింగ్ స్పెషల్
సమ్‌థింగ్ స్పెషల్


