క్రీడల అభివృద్ధికి కృషి
మహేశ్వరం: ప్రధాని మోదీ గ్రామీణ క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెండ్యాలలో నవభారత్ యూత్ ఆధ్వర్యంలో చింతోజు సుదర్శన్‌చారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో క్రీడా సంస్కృతిని పునరుద్ధరించడానికి, క్రీడలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఖేల్ ఇండియా పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. దేశానికి అపారమైన యువశక్తి ఉందని, అది వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే ప్రధాన శక్తిగా మారనుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రారష్ట్‌ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌భూపాల్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


