జిల్లా అస్తిత్వాన్ని కాపాడాలి
తుక్కుగూడ: జిల్లా అస్తిత్వాన్ని కాపాడాలని జిల్లా సేవ్ టీచర్స్ ప్రతినిధులు మంగళవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల మధుకర్‌గౌడ్ మాట్లాడారు. ఇప్పటికే వందలాంది మంది నాన్ లోకల్ ఉపాధ్యాయలు జిల్లాలోకి వచ్చారని, దీంతో స్థానికంగా ఉన్న ఉపాధ్యాయలకు అన్యాయం జరిగిందన్నారు. మరోసారి జిల్లా విభజన జరిగితే స్థానిక ఉపాధ్యాయులు మరింత నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొడ్డు రవి, గౌరవ సలహాదారు నారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి తలారి సురేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లవోలు స్వప్న, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: రైతులకు యూరియా అవసరమైన మేర విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, ముద్వీన్ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పీఏసీఎస్ గోదాములు, ఆగ్రోరైతు సేవా కేంద్రం, ఫెస్టిసైడ్స్ సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆయా గోదాములు, షాపుల్లో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ యంత్రాన్ని పరిశీలించారు. రైతులకు అవసరమైన మేర ఎరువులు, యూరియా ఈ పాస్ మెషిన్ ద్వారానే విక్రయించాలని సూచించారు. అనంతరం ముద్విన్‌లో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీని, ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఏవో శ్రీలత, ఏఈఓలు కశ్యప్, అభినవ్‌రెడ్డి పీఎసీఎస్ సిబ్బంది, డీలర్లు ఉన్నారు.
హుడా కాంప్లెక్స్: రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం అరైవ్ అలైవ్ పేరుతో సరూర్‌నగర్ డివిజన్‌లోని వెంకటేశ్వర కాలనీలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. అనంతరం సీఐ సైదిరెడ్డి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు మహేందర్, లక్ష్మణ్, నారయ్య, శిరీష, కాలనీ అధ్యక్షుడు గండు ధనం రెడ్డి, సెక్రటరీ కనకారావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభాకర్‌కు డాక్టరేట్
ఆమనగల్లు: తలకొండపల్లి మండ లం పడకల్ గ్రా మానికి చెందిన ప్రభాకర్ చౌటి జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ మీడియా పరిణామాల్లో అత్యంత కీలకంగా మారిన అసహనం అనే అంశంపై సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.నరేందర్ మార్గనిర్దేశకత్వంలో పరిశోధన చేశారు. దీనిపై సంతృప్తి చెందిన ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులు ప్రభాకర్‌కు డాక్టరేట్ పట్టా అందజేశారు.
జిల్లా అస్తిత్వాన్ని కాపాడాలి
జిల్లా అస్తిత్వాన్ని కాపాడాలి


