మహిళా ఓటర్లే అధికం
షాద్‌నగర్: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షాద్‌నగర్ మున్సిపాలిటీలో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి.
ఇదీ తుది లెక్క
మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా 53,403 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 26,679 మంది కాగా, మహిళలు 26,723 మంది. ఇతరులు ఒకరు ఉన్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో 42,134 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 53,403 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 11,269 మంది ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అయితే ఇటీవల ముసాయిదా ఓటర్లు జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించి తుది జాబితాను విడుదల చేశారు.
పోరుకు సన్నద్ధం
మున్సిపల్ పోరుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్య నేతలు ఆశావహులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అన్ని వార్డులను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, తిరిగి చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తన ఉనికి చాటేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
షాద్‌నగర్ మున్సిపాలిటీ
తుది ఓటరు జాబితా విడుదల
మున్సిపాలిటీలో మొత్తం
53,403 మంది ఓటర్లు
పట్టణంలో భారీగా పెరిగిన ఓటర్లు


