బజాజ్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బజాజ్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభం

Jan 13 2026 7:38 AM | Updated on Jan 13 2026 7:38 AM

బజాజ్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభ

బజాజ్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభ

గోల్కొండ: విద్యార్థులు చదువుకునే కళాశాలల్లోనే వారికి ఉద్యోగసంబంధమైన స్కిల్స్‌ నేర్చుకునేలా ప్రణాళిక రూపొందించామని బజాజ్‌ ఆటోలిమిటెడ్‌ బజాజ్‌ స్కిల్లింగ్‌ హెడ్‌ వేణుగోపాల స్వామి తెలిపారు. సోమవారం షేక్‌పేట్‌లోని జి.నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆయన బజాజ్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాన్ని ఆయన కళాశాల యాజమాన్య ప్రతినిధులతో మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఈ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా ప్రతి సంవత్సరం 350 మంది విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తామన్నారు. ఫార్మెడ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల వల్ల విద్యార్థుల మేధకు మరింత పదును పెట్టినట్లు అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement