ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని
కేశంపేట: బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వలస వచ్చిన కూలీ ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బిహార్ రాష్ట్రంలోని బేర్కియాకు చెందిన గుడ్డు కుమార్‌యాదవ్(20) కేశంపేట గ్రామంలోని రాఘవేందర్ వద్ద రెండు నెలల పనులకు చేరాడు. అయితే ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడిన కుమార్‌యాదవ్ కూలీ డబ్బులను పోగొట్టుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 6న పని చేసే ప్రదేశం నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం కేశంపేట గ్రామ శివారులోని వాగు సమీపంలో చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి కుమార్‌యాదవ్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు.
వలస కూలీ ఆత్మహత్య


