పీఎస్‌లో సమాచారమివ్వాలి
సంక్రాతి పండుగకు ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. కుటుంబ సమేతంగా ఊరెళ్తుండడంతో చాలా రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చోరీలకు అవకాశం ఉంది. ముందస్తు సమాచారం ఇస్తే ప్రెటోలింగ్ సిబ్బందికి ప్రత్యేక నిఘా ఉంచుతారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలి.
– కాంతారెడ్డి, సీఐ, షాబాద్
విషయాన్ని షేర్ చేయొద్దు
సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతున్న వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. ఊరెళ్లే ముందు ఇంటి ఆవరణలో ఉన్న లైట్లు వేసి వెళ్లాలి. డోరు తాళం వేసి కర్టన్‌ను వేయడం మర్చిపోవద్దు. తెలిసిన వారికి ఇంటిని గమనించమని చెప్పండి.
– విజయ్‌కుమార్, సీఐ, షాద్‌నగర్
పీఎస్‌లో సమాచారమివ్వాలి


