పండుగ పూట జరభద్రం | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట జరభద్రం

Jan 12 2026 8:07 AM | Updated on Jan 12 2026 8:07 AM

పండుగ పూట జరభద్రం

పండుగ పూట జరభద్రం

షాద్‌నగర్‌/షాబాద్‌: అసలే సంక్రాంతి పండుగ సెలవులు.. ప్రజలు ఇళ్లు విడిచి ఊరెళ్తే దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమంతగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు పాటిస్తే మేలు

ఊరికి వెళ్తున్న వారు జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండటం లేదని చుట్టుపక్కల వారితోపాటు పోలీసులకు తెలియజేయాలి. కుటుంబ సభ్యులందరూ వెళ్తే విలువైన ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లాలి. బ్యాంకు లాకర్స్‌లో భద్రపర్చుకోవడం ఉత్తమం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన వస్తువులను బీరువాలో ఉంచవద్దు. ఎక్కువ మొత్తంలో నగదు లేకుండా చూసుకోవాలి. పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇస్తే రాత్రిపూట పెట్రోలింగ్‌ సమయంలో నిఘా ఉంచేందుకు ఆస్కారం ఉంటుంది. రాత్రిపూట గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలి. వృద్ధులు, చిన్న పిల్లలు రాత్రివేళలో ఇంట్లో ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాలి. ఇంటి బయట, హాల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వాహనాలను రోడ్డుపై కాకుండా ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. ఇంటి తాళాలు రహస్య ప్రదేశంలో దాచిపెట్టాలి.

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌

సంక్రాంతి సెలవులకు ఊరెళ్తే

అప్రమత్తతంగా ఉండాలని పోలీసుల సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement