జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్
ఆమనగల్లు: జాతీయ స్థాయి అండర్–17 విభాగం కబడ్డీ పోటీలకు మండల పరిధిలో ని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్.సాయిచరణ్ ఎంపిక్యాడు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ పోటీలకు ఆయన్ను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకబృందం విద్యార్థిని అభినందించారు.
19న పట్టుబడిన
వాహనాల వేలం
ఆమనగల్లు: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా డిపాజిట్ చెల్లించాలని సూచించారు.
రోహింగ్యా యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శరణార్థులుగా నివాసం ఉంటున్న బర్మా దేశస్తుల(రోహింగ్యాలు) క్యాంప్‌లో ఓ యువ కుడు హత్యకు గురయ్యాడు. ఇన్‌స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలోని బర్మా(మయన్మార్) క్యాంప్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఆ దేశానికి చెందిన ముర్షీద్(19), అబ్దుల్లా (20) మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి ముర్షీద్ వీపు, మెడ భాగాలలో విచక్షణా రహితంగా 15 పోట్ల వరకు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చిరు వివాదంతోనే 15 కత్తి పోట్లు పొడిచాడా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్త మవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
నేరాల నియంత్రణకు
పరిధులు చూడొద్దు
నగర కొత్వాల్ వీసీ సజ్జనర్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుస్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డు కాకూడదని నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సూచించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో(టీజీ ఐసీసీసీ) బుధవారం మూడు కమిషనరేట్లకు సంబంధించి కీలక సమన్వయ సమావేశం సజ్జనర్ అధ్యక్షతన జరిగింది. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అవినాష్ మహంతి, జి.సుధీర్‌బాబులతో పాటు ఉన్నతాధికారులందరూ ఇందులో పాల్గొన్నారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నేరగాళ్లు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి క్షేత్రస్థాయి అధికారులు తీసుకువచ్చారు. పోలీసులు కాలయాపన చేయడంతో నేరగాళ్లు తప్పించుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా పోలీసులు వెంటనే స్పందించాలన్నారు. రౌడీ షీటర్లు, నేరగాళ్లు తరచూ తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడికి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్


