దొంగ ఓట్లు వేసినా పట్టించుకోలేదు
ఓటమిపాలైన అభ్యర్థుల ఆవేదన
మొయినాబాద్ రూరల్: మండల పరిధిలోని కుత్బుద్దీన్‌గూడలో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని రిటర్నింగ్ అధికారులు, పోలీసులకు అప్పగించినా పట్టించుకోలేదని ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ముజాహిద్‌ఆలీ, మిరాజుద్దీన్ ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కుత్బుద్దీన్‌గూడలో 1,725 మంది ఓటర్లు ఉన్నారని, ఈనెల 14న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 1,404 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ సమయంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వారిలో సుమారు పది మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కొద్దిసేపటి తర్వాత వదిలేశారని పేర్కొన్నారు. యూఎస్, దుబాయ్‌లో ఉన్న వారి పేర్లతో ఇతరులు వచ్చి ఓట్లు వేశారన్నారు. ఓటరు జాబితాలోని చాలా మంది హైదరాబాద్‌లో ఉంటారని, వీరి పేరుతో నగరం వచ్చిన వారిలో చాలా మంది దొంగ ఓట్లు వేశారని తెలిపారు.
భోజనం చేస్తూ వ్యక్తి మృతి
షాబాద్: భోజనం చేస్తుండగా గొంతులో అన్నం ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌కు చెందిన చిల్కమర్రి జంగయ్య (50) సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా, ఒక్కసారిగా సరం పడింది. ఆయాస పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణం వదిలాడు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేందర్‌గౌడ్, సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ రాహుల్ గుప్త బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు.
గొడవలకు కారణమైన పలువురి బైండోవర్
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు చేవెళ్ల ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం 13 మందిని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కృష్ణయ్య ఎదుట బైండోవర్ చేశామన్నారు. గత 14న సింగప్పగూడలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి తరఫు వ్యక్తులు, గెలపొందిన సర్పంచ్ మద్దతుదారుడు వెంకటేశ్వర్‌రెడ్డిపై దాడి చేశారు. ఈకేసుతో సంబంధం ఉన్న వారిని బైండోవర్ చేసి, రూ.5 లక్షల పూచీకత్తుపై వదిలేశామన్నారు. కేసు నమోదైన వారిలో షేక్ ఫయాస్, అలీ హస్నన్, ములుగు ప్రమోద్‌రెడ్డి, మహమ్మద్ అర్షద్, ఎండీ ఆదిల్, ఎండీ ఫెరోజ్, ఎండీ అద్నాన్, ఎండీ సల్మాన్, అస్లాం, ఆరిఫ్, జాఫర్‌పాషా, రవికిరణ్‌రెడ్డి, ఎండీ సుమేర్ ఉన్నట్లు తెలిపారు.
ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన
అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు
అబిడ్స్: అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్‌ఓ) సంస్థ అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు 2025 గుర్తింపునిచ్చింది. సంస్థ ప్రతినిధులు అబిడ్స్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఏ ఇమాన్యుయేల్‌కు సర్టిఫికెట్‌ను అందజేసి ప్రశంసించారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, రిసెప్షనిస్ట్ సేవలు, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల ప్రవర్తించే విధానాలు, పోలీస్‌స్టేషన్‌లో పరిశుభ్రత, స్టేషన్‌లో స్బింది ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని ఐఎస్‌ఓ అంతర్జాతీయ సంస్థ గుర్తింపు ప్రకటించింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇమాన్యుయేల్ మాట్లాడతూ...పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సరైన న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు లభించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తమ సిబ్బంది, ఎస్‌ఐలు, అందరి కృషి తోనే ఈ గుర్తింపు లభించందన్నారు.


