ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం
కడ్తాల్: చరికొండకు చెందిన పాలకూర్ల లక్ష్మమ్మ–రాములుగౌడ్ కుటుంబం 30 ఏళ్లుగా ప్రజా ప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. లక్ష్మమ్మ 1996లో తొలి సారి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2006లో జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో విజయంసాధించారు. అనంతరం ఆమె భర్త రాములుగౌడ్ 2019లో ఎంపీటీసీ సభ్యుడిగా సేవలు చేశారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వీరి కుమారుడు మహేందర్‌గౌడ్ సర్పంచ్‌గా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది.
నాడు తనయుడు.. నేడు తల్లి
కడ్తాల్: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రా మంలో రెండు పర్యాయాలు ఉత్కంఠగా సాగిన పోరులో నాడు తనయుడు, నేడు తల్లికి సర్పంచ్ పదవులు వరించాయి. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన నాయిని నరేందర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు. 2019లో బీసీలకు రిజర్వ్ కావడంతో ఆయన పోటీ చేయడం కుదరలేదు. ఇటీవల ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో నాయిని నరేందర్ తల్లి యశోధ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి బీఆర్‌ఎస్ మద్దతుదారు రేవల్లి మల్లమ్మపై 44 ఓట్లతో విజయం సాధించారు.
అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య
వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించిన దంపతులు
కడ్తాల్: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్‌నాయక్‌ను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. దీంతో లోకేశ్‌నాయక్ సతిమణి నీలావతి బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లకు అభినందనలు
ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం
ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం
ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం
ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం


