పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రావుపల్లి గ్రామ సర్పంచ్ గోటూరి రాంచంద్రయ్యగౌడ్, వార్డుసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించి.. స్వీట్లు తినిపించారు. ఆయనను కలిసిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, ఉపసర్పంచ్ అనూషఅంజన్‌కుమార్, వార్డుసభ్యులు మల్లీశ్వరి, జ్యోతి వెంకటేశ్, గోపాల్, మాజీ ఉపసర్పంచ్ నాగిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్‌లో చేరిక..
మండలంలోని నాల్యట గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎల్లయ్య, తన అనుచరులతో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాలట గ్రామ నాయకులు, యవకులు ఉన్నారు.


