కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలు
మొయినాబాద్: నూతన ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యంలో విద్యార్థుల ప్రతిభకు ‘ఐడియా ఎక్స్‌ప్రో 2025’ వేదికగా నిలిచింది. అజీజ్‌నగర్ రెవెన్యూలోని కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో డిజైనింగ్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఐడియా ఎక్స్‌ప్రో 2025 ఘనంగా నిర్వహించారు. తొలి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ(ఏఐ), సమాచార సాంకేతికత, సామాజిక ఆవిష్కరణ వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ వైస్ చైర్మన్ మిహిర్‌కుమార్ పరియాల్, సీఎస్‌ఆర్, ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ సుదర్శనం, ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న బ్యాగు
ప్రయాణికుడికి అప్పగింత
కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలు


