పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్‌గా జ్యోతినరేందర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్‌గా జ్యోతినరేందర్‌రెడ్డి

Dec 18 2025 10:58 AM | Updated on Dec 18 2025 10:58 AM

పాపిర

పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్‌గా జ్యోతినరేందర్‌రెడ్డి

● జలమండలి అధికారులకుసమాచారం ఇచ్చిన స్థానికులు ● పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

కేశంపేట: మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్‌గా తాండ్ర జ్యోతినరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. తొలి విడతలో భాగంగా ఈనెల 11నసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తయినా, కోరం లేకపోవడంతో ఉప సర్పంచ్‌ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్‌ అధికారి చంద్రశేఖర్‌ సమక్షంలో బుధవారం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించారు. పది మంది వార్డు సభ్యులతో పాటు సర్పంచ్‌ హాజరయ్యారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన జ్యోతికి ఐదుగురు వార్డు సభ్యులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ఉప సర్పంచ్‌గా ఎన్నికై నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. సీఐ నరహరి బందోబస్తును పర్యవేక్షించారు.

12 మంది

ఉప సర్పంచ్‌ల ఎన్నిక

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గానూ 12 చోట్ల బుధవారం ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. చర్లపటేల్‌గూడ, ఉప్పరిగూడ ఉప సర్పంచ్‌ల ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు.

ఉప సర్పంచ్‌లు వీరే..

దండుమైలారం జి.విజయలక్ష్మి, కప్పపహాడ్‌ పి.రమేశ్‌, కర్ణంగూడ వై.రవిందర్‌రెడ్డి, ముకునూర్‌ ఆర్‌.పావణి, నాగన్‌పల్లి పి.జంగయ్య, నెర్రపల్లి వేణుగోపాల్‌రెడ్డి, పోచారం ఎం.కృష్ణ, పోల్కంపల్లి కె.వెంకటేశ్‌, రాయపోల్‌ జి.శేఖర్‌రెడ్డి, తుర్కగూడ ఏనుగు వెంకట్‌రెడ్డి, తులేకలాన్‌ డి.జంగయ్య, ఎల్మినేడు ఎం.వెంకటప్రతాప్‌రెడ్డి ఉప సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.

‘గండిపేట’లోకి

సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలు

మొయినాబాద్‌: హైదరాబాద్‌ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్‌ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని బుధవారం స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఓ సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్‌ ట్యాంక్‌ డ్రైవర్‌ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్‌ వర్క్స్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. శివనాయక్‌కు సంబంధించిన వాహనమని.. హిమాయత్‌నగర్‌ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్‌ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

పోలింగ్‌ రోజు విద్యుత్‌

అంతరాయం

11 కేవీ ప్యూజ్‌ సెట్‌పై ఇనుప తీగను వేసిన గుర్తు తెలియని వ్యక్తి

యాచారం: ఎన్నికల వేళ మండలంలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో విద్యుత్‌ సరఫరాలో బుధవారం తీవ్ర అంతరాయం కలిగింది. గుర్తు తెలియని వ్యక్తి గ్రామంలోని 11 కేవీ ఫ్యూజ్‌ సెట్‌పై ఇనుప తీగను వేశాడు. దీంతో మంటలు చెలరేగి విద్యుత్‌ సరఫరాలో రెండు గంటలకు పైగా అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌ఈ లక్ష్మీనారాయణ గ్రామంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను సందర్శించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. పోలింగ్‌, కౌటింగ్‌ వేళ గ్రామంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.

పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్‌గా జ్యోతినరేందర్‌రెడ్డి   
1
1/1

పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్‌గా జ్యోతినరేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement