కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’
షాబాద్: మండల పరిధిలో కుర్వగూడ సర్పంచ్ బుయ్యని సంధ్యారాణి హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఆమె గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా మండలంలో బీఆర్‌ఎస్ సత్తాచాటింది. మొత్తం 41 పంచాయతీలు ఉండగా, 22 జీపీలను గులాబీ సానుభూతిపరులే సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ 17, బీజేపీ, ఇండిపెండెంట్‌కు చెరో స్థానం దక్కింది.
ఒక్క ఓటు తేడాతో విజయం
కడ్తాల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నార్లకుంటతండా సర్పంచ్ స్థానానికి హోరాహోరీగా పోటీ సాగింది. ఒకేఒక్క ఓటు తేడాతో అంగోతు రాంచందర్‌నాయక్ విజయం సాధించారు. తండాలో మొత్తం 462 ఓట్లు ఉండగా, 423 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన అంగోత్ రాంచందర్‌నాయక్‌కు 206 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన జాటవత్ రమేశ్‌కుమార్‌కు 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 ఓట్లు పడగా, 9 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రాంచందర్‌నాయక్ విజయం సాధించారు.
పంచాయతీ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్
షాబాద్: గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నల్లటి పొగ రావడంతో స్థానికులు గమనించి పంచాయతీ సిబ్బందికి ఫోన్ చేశారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని తెలిపారు.
కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’
కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’


