ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
ఆమనగల్లు: ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కోరారు. మాడ్గుల మండలం కొల్కులపల్లిలో సోమవారం సర్పంచ్ అభ్యర్థి బట్టు ధర్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ అమలు సాధ్యం కాని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కేవలం మాయమాటలు చెబుతూ ప్రజలను వంచిస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్


