ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త

Dec 16 2025 7:02 AM | Updated on Dec 16 2025 7:02 AM

ప్రైవ

ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త

● జంతు మార్పిడిలో భాగంగా త్వరలో తరలింపు

శంకర్‌పల్లి: ప్రైవేటు బ్యాంకులు ప్రజలకు వి రి విగా రుణాలిస్తున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ ఇన్నోవేటివ్‌ హాబ్‌ సీఈఓ రాజేశ్‌ బన్సాల్‌ సూచించారు. దొంతాన్‌పల్లిలో ని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్యాంకింగ్‌ సదస్సుకు సోమవారం ఆయన, విశ్వవిద్యాలయ కులపతి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ డా. సి. రంగరాజన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్‌బీఐలో పనిచేసి, పదవీ విరమణ పొందిన నిపుణులు రాసిన పుస్తకాన్ని రంగరాజన్‌ ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ తదితర ఆర్థికపరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక పురోభివృద్ధిని మారుస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. రానున్న కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో సమూల మార్పులు రానున్నాయన్నారు. సదస్సులో ఇక్ఫాయ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ శోభా రాణి యశస్వి, ఉప కులపతి డా. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన నియామకం

ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి నియమితులయ్యారు. శంషాబాద్‌ పట్టణంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేర కు జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా పురుషోత్తంరెడ్డిని నియమించి ఘనంగా సత్కరించారు.

డివిజన్ల ఏర్పాటుపై

అభ్యంతరాలు

తుర్కయంజాల్‌: జీహెచ్‌ఎంసీ ఇటీవల ప్రకటించిన వార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తుర్కయంజాల్‌ బీజేపీ నాయకులు సోమ వారం కమిషనర్‌ కర్ణన్‌ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత జనాభా లెక్కల ప్రకారం కాకుండా, కొత్త కాలనీలు, ఇళ్లలో నివసిస్తున్న జనాభా ఆధారంగా విభజన చేపట్టాలని కోరారు. తుర్కయంజాల్‌, తొర్రూర్‌ డివిజన్లను మొత్తం నాలుగు డివిజన్లుగా చేయాలని, కోహెడ పేరుతో ఓ డివిజన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ తుర్కయంజాల్‌ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బచ్చిగళ్ల రమేష్‌, నాయకులు కొత్త రాంరెడ్డి, సానెం అర్జున్‌ గౌడ్‌, కొండ్రు పురుషోత్తం, అనిల్‌ కుమార్‌, బిందు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన జూకి

‘వంతారా’ కంగారూలు

చార్మినార్‌: నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శ నశాలకు త్వరలో కంగారూలు రానున్నాయి. జంతు మార్పిడిలో భాగంగా గుజరాత్‌లోని వంతారా జూ నుంచి ఇక్కడికి ఒక జతను రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. జాంనగర్‌లోని రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ప్రపంచ వన్య ప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా అధికారులతో జంతువుల మార్పిడి కింద కంగారూలను రప్పించడం కోసం జరుగుతున్న చర్చలు ఫలిస్తే.. మన సందర్శకులకు కంగారూలు కనువిందు చేయనున్నాయి. గత 2020లో జపాన్‌ జూ పార్కు నుంచి రెండు జతల కంగారూలను రప్పించడం కోసం ఇక్కడి జూ పార్కులో ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ కారణంగా ఈ డీల్‌ కుదరకపోవడంతో..తిరిగి ఇప్పుడు వంతారా జూ పార్కు అధికారులతో సెంట్రల్‌ జూ అథారిటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కంగారూల కోసం ఎన్‌క్లోజర్లు సిద్ధంగా ఉన్నాయి. కంగారూలను మనం తెచ్చుకుంటే.. జంతు మార్పి డిలో భాగంగా మనం ఒక ఏనుగును (మగ/ఆడ) వారికి ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత జూ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే జంతు మార్పిడిలో భాగంగా రెండు నెలల క్రితం 20 జతల మూసిక జింకలను ఇచ్చి ఒక జత జీబ్రాలను రప్పించుకోగా.. అవి వారం రోజులుగా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త 
1
1/2

ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త

ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త 
2
2/2

ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్‌ జాగ్రత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement