నిన్న కళకళ.. నేడు వెలవెల
కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ పేరుతో ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులతో సీఎం ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రజలు, విద్యార్థుల సందర్శనార్థం 10 నుంచి 13వతేదీ వరకు అనుమతించారు. ఈ నెల 13తో సమ్మిట్ పూర్తవడంతో తాత్కాలిక నిర్మాణాలను కార్మికులు తొలగించే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా డిజిటల్ స్క్రీన్లు, రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలు, వీఐపీల రాకతో సందడిగా మారిన ప్రాంగణం ప్రస్తుతంచిన్నబోయింది.
అబ్బురపరిచిన డిజిటల్ వాల్ ఇలా..
తొలగిస్తున్న తాత్కాలిక నిర్మాణాలు
నిన్న కళకళ.. నేడు వెలవెల
నిన్న కళకళ.. నేడు వెలవెల


