విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
మహేశ్వరం: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్‌లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదన్నారు. మన చుట్టూ జరిగే విషయా లను గమనించడం కూడా సైన్సేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కస్నా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రయోగం
కొందుర్గు: మహేశ్వంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో కొందుర్గు ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో చదివే మణితేజ తయారు చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయికి ఎంపికై నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రాజెక్టు తయారీలో సైన్స్ టీచర్ రామకృష్ణ సహ కరం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మణితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు


