నూతన సర్పంచ్‌లకు సన్మానం
కొత్తూరు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు, పాలకవర్గాల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మాజీ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లాపూర్ పంచాయతీ రెడ్డిపాలెంలో ఆదివారం నిర్వహించిన నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు, గ్రామస్తులు నూతనంగా ఎన్నికై న మక్తగూడ సర్పంచ్ శ్రీరాములు, మల్లాపూర్‌తండా సర్పంచ్ మీనాక్షి దశరథ్‌నాయక్, మల్లాపూర్ సర్పంచ్ చిట్టెడి నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్‌లు రాములుగౌడ్, శంకర్‌నాయక్‌తో పాటు పలువురు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు, నాయకులు, యువజన సంఘాల నాయకులు అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయా లు చేయాలని, అన్ని పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జయేందర్‌రెడ్డి, జార్జి రెడ్డి, రాజు, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.


