డివిజన్‌కు కొహెడ పేరు పెట్టాలి
తుర్కయంజాల్: జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని 53వ డివిజన్‌కు తొర్రూర్ పేరుకు బదులుగా కొహెడ పేరును పెట్టాలని డిమాండ్ చూస్తూ కొహెడ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న కొహెడను వదిలేసి, చిన్న గ్రామామైన తొర్రూర్ పేరుతో డివిజన్‌ను ఏర్పాటు చేయడం కక్షసాధింపు చర్యలాంటిదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేరును మార్చాలని అన్నారు. అదేవిధంగా చార్మినార్ జోన్ నుంచి ఎల్‌బీనగర్‌కు మారుస్తున్నట్లు ఉత్తర్వులను వెల్లడించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, అమర్‌నాఽథ్ గుప్తా, కృష్ణాచారి, రంగారెడ్డి, బల్‌దేవ్‌రెడ్డి, విజయ్‌బాబు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


