● బరిలో బ్రదర్స్
మహేశ్వరం: బంధుత్వాలను పక్కనపెట్టి పలువురు పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగారు. నిన్నమొన్నటివరకు కలిసున్న వారు కాస్తా ప్రత్యర్థులుగా మారి ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మహేశ్వరం మండలం పెండ్యాల సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయింది. ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ పదవి కోసం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా అన్న జైత్వారం జగన్మోహన్‌రెడ్డి, బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా తమ్ముడు జైత్వారం శ్రీధర్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఇద్దరి మధ్య తీ వ్ర పోటీ నెలకొంది. కు టుంబసభ్యులు సైతం విడివిడిగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికీ గతంలో ఉపసర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో తాము చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న సం‘గ్రామంలో’ రాజకీయం వెడెక్కింది. వీరి తండ్రి జైత్వారం శాయిరెడ్డి గతంలో సర్పంచ్‌గా చాలా కాలం పని చేశారు. ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో ఈ నెల 17తో తేలనుంది.
● బరిలో బ్రదర్స్


