● వలస ఓటర్లకు గాలం
ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్‌రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు ఊరికి రావాలని కోరుతున్నారు. కొంతమంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంతమొత్తం ముట్టజెపుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.


