అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోండి
మొయినాబాద్‌రూరల్: గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని బాకారంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్‌యాదవ్ తరఫున వారు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధితో పాటు ఎలాంటి సమస్యలు ఉండవని సూచించారు. బాకారంలో శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


