బీఆర్‌ఎస్ నాయకులపై దాడి
బషీరాబాద్: మండల పరిధిలోని కుప్పన్‌కోట్‌తండాలో గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు బీఆర్‌ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాంశెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఓటమిని జీర్ణించుకోలేక విచక్షణరహితంగా దాడి చేశారని బాధితులు శారుబాయి, శంకర్, మన్యనాయక్, లక్ష్మణ్ నాయక్ శుక్రవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన కుల నాయకులు ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు.


