ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్‌లు
బషీరాబాద్: సొంతూరుకు స ర్పంచ్‌గా సేవలు అందించడానికి అందరికీ అవకాశాలు రావు. రిజర్వేషన్‌తో పాటు అదృష్టం కలిసి రావాలి. మండల పరిధిలోని ముగ్గురు సర్పంచ్‌లకు మాత్రం రెండో సారి ఈ అదృష్టం వరించింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మైల్వార్, గొట్టిగ కలాన్, బోజ్యానాయక్‌తండాకు సర్పంచ్‌లుగా ఎన్నికై న సీమాసుల్తానా, సాబేర్, శాంతిభాయి రిజర్వేషన్లు కలిసి రావడంతో రెండోసారి పోటీచేసి గెలుపొందారు. గతంలో పంచాయతీల్లో వారు చేసిన పనులకు నేటికీ బిల్లులు రాకపోయినా వారు చేసిన అభివృద్ధిని చూసి వారికే మళ్లీ పట్టం కట్టారు. తమకు మరింత బాధ్యత పెరిగిందని.. మరింత అభివృద్ధి చేసే బాధ్యత రెండో సారి సొంత గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. అలాగే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పన్‌కోట్ సర్పంచ్‌గా రెండో సారి పోటీ చేసిన మాజీ సర్పంచ్ పద్మ పరాజయం చెందారు.
సీమాసుల్తానా, సర్పంచ్, మైల్వార్
శాంతిభాయి, సర్పంచ్, బోజ్యానాయక్‌తండా
ఎఫ్ సాబేర్, సర్పంచ్, గొట్టిగకలాన్
ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్‌లు
ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్‌లు


