రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
తాండూరు రూరల్: ప్రజలు బీజేపీని గ్రామాల నుంచి బలోపేతం చేసేందుకు నడుంకట్టారని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. మండల పరిధిలోని వీర్‌శెట్టిపల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి తూర్పు లక్ష్మి విజయం సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నూతన సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. మోదీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీని అధిక స్థానాల్లో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మిని సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫిరంగి జర్నప్ప నాయకులు నర్సింలు, హరి, శ్రవణ్, పాల పరుశురాం, వాకిటి పరుశురాం, శంకర్, ఆనంద్ పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి


