పంచాయతీ ప్రచారంలో సినీ నటుడు శివారెడ్డి
ఆమనగల్లు: ఆకుతోటపల్లి గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి నాలపట్ల నరేందర్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం సినీ నటుడు శివారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థికి బంధువైన ఆయన ప్రచారంలో భాగంగా తన హాస్యంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. నరేందర్‌రెడ్డిని గెలిపించి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన
యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం జెట్టూరుకు చెందిన రమేశ్ ఈనెల 10న ఇందిరమ్మ కాలనీలో మతిస్థిమితంలేని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం యా లాల పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


