యాలాల అభివృద్ధికి సహకారం
యాలాల: నూతన సర్పంచ్‌లను శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. యాలలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, జెడ్పీటీసీ మాసీ భ్యుడు సిద్రాల శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిపై పేరి రాజేందర్‌రెడ్డి బలపరిచిన సీహెచ్ శివయ్య 244 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శివయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. యాలాల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
యాలాల సర్పంచ్, నాయకులతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి


