రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు
షాద్‌నగర్‌రూరల్: రాజకీయంగా ఎదుర్కోలేకే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అనుచరులు తమపై దాడిచేశారని బీఆర్‌ఎస్ నేత దినేశ్‌సాగర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేటలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన ప్రవీణ్‌యాదవ్‌పై మాజీ ఎమ్మె ల్యే అనుచరులు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న విష యం తెలుసుకొని.. తాము అక్కడికి వెళ్లే క్రమంలో గ్రా మంలో తమపై మూకుమ్మడిగా దాడి చేశారని, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. తాము గ్రామానికి డబ్బులు, మద్యం పంచేందుకు వెళ్లలేదన్నారు. ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి పంపిస్తేనే గ్రామానికి వచ్చినట్లు తాము చెప్పాలని వారు బలవంతం చేశారన్నారు. సొంత పార్టీ నాయకులపైనే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాత్రి జరిగిన ఘ టనతో తాము వారి గ్రామం నుంచి బ్రతికి బయటికి వస్తామని అనుకోలేదన్నారు. గత ఎన్నికల్లో తాము బీఆర్‌ఎస్ గెలుపు కోసం శ్రాయశక్తులా ప్రయత్నించామన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతిని తాము ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. తమపై దాడులకు పాల్పడటం సరికాదని, ఎవరి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా దినేశ్‌సాగర్ తనకు దాడిలో తగిలిన దెబ్బలను మీడియాకు చూపించారు. సమావేశంలో నాయకులు శివాచారి, గోపాల్, జీజో జాన్సన్, మహేశ్‌గౌడ్, అనిల్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నేత దినేశ్‌సాగర్


