అహంకారంతో మాట్లాడటం సరికాదు
షాద్‌నగర్: ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అహంకారంతో మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు ఎన్నికై న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం గౌరవం లేకుండా ఎమ్మెల్యే పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం సరికాదన్నారు. ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా ఎమ్మెల్సీ మాట్లాడటం సరికాదన్నారు. ఎవరు ఎలాంటి వారో, ఎవరు పేదలను భూములను కబ్జాచేసి గుండాగిరి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక సహించేది లేదన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని బట్టలూడదీసి కొడతా అనడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు బాబర్‌ఖాన్, తిరుపతిరెడ్డి, బస్వం, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్ రఘునాయక్


