ఒకే కుటుంబం నుంచి ఇద్దరు
చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా సర్పంచ్ పీఠం ఎక్కాలనే కోరికతో బంధాలను లెక్క చేయకుండా ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులుగా మారుతున్నారు. చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్ గ్రామంలో 20 ఏళ్లుగా మాజీ సర్పంచ్ తిప్పని వెంకట్‌రెడ్డి కుటుంబానిదే రాజకీయంగా పైచేయి. వారు లేదా వారి తరఫు అభ్యర్థులే ఇన్నాళ్లు సర్పంచ్‌లుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆ గ్రామం జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చింది. అయితే వెంకట్‌రెడ్డి కుటుంబం నుంచే ఇద్దరు పోటీలో ఉండడం గమనార్హం. ఒకరు వెంకట్‌రెడ్డి కొడుకు రాంరెడ్డి భార్య మాధవి ఉండగా, మరొకరు వెంకట్‌రెడ్డి అక్క కొడుకు రఘువీర్‌రెడ్డి(చింటు) భార్య చిరోషా బరిలో ఉన్నారు. రఘువీర్‌రెడ్డి చిన్నప్పటి నుంచి మేనమామ వెంకట్‌రెడ్డి ఇంట్లో ఉండే పెరిగారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీలో ఉండడంతో గ్రామస్తులు సైతం ఎవరికి మద్దతు తెలపాలో అని అయోమయంలో పడ్డారు.
సర్పంచ్ పీఠం కోసం తీవ్ర కసరత్తు
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు


