కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
● చింతలపల్లి, సింగంపల్లిలో
ఎన్నికల ప్రచారం
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చింతలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పు శ్రీశైలం, సింగంపల్లిలో రాంబాబుకు మద్దతుగా ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.


