నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ
నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 11నుంచి 13 వరకు పోస్టల్ బ్యాలెట్ స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ కుసుమమాధురి తెలిపారు. ఇందుకోసం ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల అధికారి రమాదేవి ఇక్కడ అందుబాటులో ఉంటారని, సర్వీస్ ఓటర్లు, జవాన్లు ఆమనగల్లులో ఓటరు అయిఉండి వేరే ప్రదేశంలో ఉద్యోగం చేసేవారు, ఎలక్షన్ విధులకు వెళ్లే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు
మాడ్గుల: మండలంలోని ఇర్విన్, మాడ్గుల, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి ఉష పర్యటించారు. ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడంతో పాటు పురుగు మందుల నాణ్యతను పరిశీలించారు. నాసిరకం విత్తనాలు, మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్టార్లు, బిల్ పుస్తకాలను పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు విధిగా బిల్లు ఇవ్వాలని తెలిపారు. ప్రతీ షాపు వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. ఆమె వెంట ఏఓ అరుణకుమారి, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రూ.30 లక్షల మద్యం నేలపాలు
మొయినాబాద్: డీసీఎం టైరు పేలడంతో బోల్తా పడి రూ.30లక్షల విలువ గల మద్యం నేల పాలైంది. ఈ సంఘటన బుధవారం మండలంలోని చిలుకూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ఎన్కెపల్లికి చెందిన ఓ వైన్స్ యాజమాని శంషాబాద్‌లోని ఓ లిక్కర్ డిపో నుంచి రూ.30 లక్షల విలువ గల మద్యాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని డీసీఎంలో తీసుకొస్తుండగా.. చిలుకూరు గ్రామ సమీపంలోకి రాగానే టైరు పేలి బోల్తా పడింది. దీంతో వాహనంలోని మద్యం బాటిళ్లన్నీ రోడ్డు పాలు అయ్యాయి. ప్రమాద సమయంలో డీసీఎంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
డీసీఎం టైరు పేలడంతో చిలుకూరులో ఘటన
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని బుధవారం పీసీసీ జనరల్ సెక్రెటరీ గోవిందరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు గోవిందరావు దంపతులకు ఆలయ ప్రతిమ, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, సభ్యులు దయాకర్‌రాజు, దర్శన్‌గౌడ్, అర్చకులు సాయిశివ తదితరులు పాల్గొన్నారు.
1/3
నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ
2/3
నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ
3/3
నేటినుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ