నాడు స్నేహ ‘హస్తం’.. నేడు గులాబీ నేస్తం
సర్పంచ్ బరిలో మాజీ వైస్ ఎంపీసీ ఆనంద్
కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 కడ్తాల్–2 ఎంపీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాడు. మండల వ్యాప్తంగా పది ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి నలుగురు చొప్పున, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఆనంద్ గెలుపొందాడు. నాడు ఆనంద్ మద్దతుతో కాంగ్రెస్‌కు ఎంపీపీ పదవి వరించగా.. అదే పట్టుదలతో ఆయన వైస్ ఎంపీపీ పదవిని దక్కి ంచుకున్నాడు. తదనంతర రాజకీయ సమీకరణా ల్లో ఆయన బీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కడ్తాల్ మేజర్ పంచా యతీకి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలోదిగి మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.


